Sankranthiki Vasthunam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh)-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. నరేశ్, పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ డే నుంచి చాలా లొకేషన్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ చిత్రం బాహుబలి 2 వసూళ్లను అధిగమించి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు వసూళ్లను బీట్ చేసింది. బాహుబలి 2 మూవీ 13 రోజు రూ.4.68 కోట్లు వసూళ్లు చేస్తే.. సంక్రాంతికి వస్తున్నాం అదే రోజునాటికి రూ.7 కోట్లు రాబట్టింది. ఏపీలో ఇటీవలే టికెట్ రేట్ల తగ్గిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ఈ ఫీట్ నమోదు చేయడం అదిరిపోయే రికార్డ్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారో చెప్పేందుకు ఇదే ఉత్తమ ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు వచ్చినా కంటెంట్ బాగుంటే సినిమాను ప్రోత్సహించేందుకు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని అనిల్ రావిపూడి మరోసారి రుజువు చేశాడని తాజా వసూళ్లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రం 12 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.260 కోట్లు వసూళ్లు చేసింది.
ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేశ్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ కాంబోలో విడుదలై నార్త్ అమెరికా-2.3 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లకుపైగా) రాబట్టి.. యూఎస్ఏలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిందని తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ