ఆషాఢ బోనాల సందడి షురూ..
బోనాల సందడి| హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫుణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతున్నదని చెప్పారు. భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతేడాది కరోనాతో పండుగ జరుపుకోలేకపోయామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు.
ఆదివారం ప్రారభమైన ఆషాఢ బోనాలు వచ్చే నెల 8వ తేదీవరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పి్స్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 600 మందికిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలి అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి..
బ్రేకింగ్ న్యూస్: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం
పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
తాలిబన్ ఎఫెక్ట్.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మంది భారత అధికారులు వెనక్కి
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
జమ్ములో ఎన్ఐఏ తనిఖీలు.. ఐదుగురు అరెస్టు
కేరళలో మరో జికా వైరస్ కేసు.. 15కు చేరిన బాధితులు
హమ్మయ్య.. మెస్సీ మొత్తానికి సాధించాడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

