బ్రేకింగ్ న్యూస్: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం
6 people electrocuted: అప్పటిదాకా కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోని సభ్యులంతా ఒకేసారి విగతజీవులయ్యారు.

భోపాల్: అప్పటిదాకా కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోని సభ్యులంతా ఒకేసారి విగతజీవులయ్యారు. విద్యుత్ షాక్ తగలడంతో ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విలవిల్లాడుతూ నిమిషాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లాలోని బిజావర్ ఏరియాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీజావర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు కుటుంబసభ్యులు ఉపక్రమించారు. అందుకోసం విద్యుత్ మోటార్ సాయంతో ట్యాంక్‌లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఇంతలో ఒకరికి విద్యుత్ వైర్ తగిలి షాక్ గురికాగా.. ఒకరిని ఒకరు రక్షించే ప్రయత్నంలో కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు నిమిషాల్లో కన్నుమూశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనకు సంబంధించి, మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అప్పటిదాకా ఇరుగుపొరుగుతో కలిసి మెలిసి ఉన్న కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

