హైదరాబాద్ : భారీ వర్షాలకు(Heavy rains) సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలను(Flood victims) ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. సోమవారం ఆయన వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు రద్దు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
వర్షాలపై ప్రజలనుఎ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వానలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. అలాగే అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దన్నారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.