Viajayawada Rains | భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ కూడా నీట మునిగింది.
రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆదివారం రాత్రి వరద ఉధృతి పెరగడంతో విజయ డెయిరీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. డెయిరీకి సంబంధించిన మెషిన్లు, వాహనాలు కూడా ముంపునకు గురయ్యాయి. వరద నీరు చేరడంతో డెయిరీ లోపల ఉన్న పాలు, పాల ఉత్పత్తులు అన్నీ పాడైపోయాయి. దీంతో సుమారు 70 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
డెయిరీలోకి నీళ్లు రావడం వల్ల రెండు రోజుల పాటు అందులోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొందని విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. చిట్టినగర్‌కు ప్రత్యామ్నాయంగా వీరవల్లి కొత్త యూనిట్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.