DTC Workers : దేశ రాజధానిలో డీటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు దుర్భర పరిస్ధితి ఎదుర్కొంటున్నారని, వారికి సామాజిక భద్రత, నిలకడతో కూడిన ఆదాయం, శాశ్వత ఉద్యోగం వంటివి లేవని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని డీటీసీ బస్సుల్లో తన ప్రయాణ అనుభవాలను రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ పోస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.
గొప్ప బాధ్యతతో కూడిన ఉద్యోగాలను కాంట్రాక్టు కార్మికులుగా కుదించారు. డ్రైవర్లు, కండక్టర్లు అనిశ్చితితో బతుకీడ్చాల్సిన పరిస్ధితి తీసుకొచ్చారని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రయాణీకుల భద్రత కోసం శ్రమించేందుకు నియమించిన హోంగార్డులకు ఆరు నెలలుగా వేతనాలు లేవని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కార్మికులు, ఉద్యోగులు ప్రైవేటీకరణ భయంతో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో డీటీసీ ఉద్యోగులు, కార్మికులను కూడా ప్రైవేటీకరణ భయం వెంటాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో రోజూ కోట్లాది మందిని వారి వారి గమ్యస్ధానాలకు చేర్చుతున్న వీరి అంకితభావానికి తిరిగి అన్యాయాన్నే బహుమతిగా పొందుతున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం, పూర్తి న్యాయం పొందడమే వీరి డిమాండ్లని రాహుల్ గాంధీ వివరించారు.
Read More :
Vijayawada | జలదిగ్భందంలో విజయవాడ.. ప్రాంతాలవారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!