గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 10:47:19

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

యాదాద్రి భువనగిరి :  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయాన్ని రాతి శిలలతో అందంగా, మహా దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వచ్చే బ్రహ్మోత్సవాలు కొత్తగా నిర్మితమైన ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రపంచ అబ్బురపడేలా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.


logo