సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 12:25:16

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : జిల్లాలోని వైరా నియోజకవర్గం తనికెళ్ల, సింగరాయిపాలెం గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేడు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రవాణా గురించి మంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి సింగరాయిపాలెం గ్రామంలోని నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎమ్మెల్యే రాములు నాయక్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.



logo