కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న స్పీకర్ పోచారం
కొవిడ్ టీకా | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నిమ్స్‌లో కొవిడ్ టీకా రెండో డోసు

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నిమ్స్‌లో కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. స్పీకర్, చైర్మన్ల సతీమణులు పుష్ప, అరుంధతి కూడా టీకా తీసుకున్నారు. మార్చి 3వ తేదీన వీరు మొదటి డోసు తీసుకున్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టీకా విషయంలో ఎవరూ అపోహ పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. తాను మొదటి డోసు తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ర్పభావాలు సంభవించలేదని స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
మాస్కు ధరించకపోతే రూ. 1000 జరిమానా
మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా, 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. ఈ కఠిన నిబంధనలు మన మేలు కోసమే, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలి అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలి. శానిటైజర్, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి అని స్పీకర్ పోచారం సూచించారు.
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు అనుమతి నిరాకరణ
కరోనా విజృంభణ.. రేపు వైద్యశాఖ అత్యవసర సమావేశం
మాజీ ముఖ్యమంత్రికి బీజేపీ రూ. 10 కోట్లు!
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

