మాజీ ముఖ్యమంత్రికి బీజేపీ రూ. 10 కోట్లు!
బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కుమారస్వామి రూ. 10 కోట్లు తీసుకున్నారని అహ్మద్ ఆరోపించారు.
ఆ తర్వాత బసవకల్యాణ్ నియోజకవర్గానికి జేడీఎస్ అభ్యర్థిని బరిలో దింపారని పేర్కొన్నారు.
బసవకల్యాణ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నారాయణ్ రావు కరోనా కారణంగా గతేడాది సెప్టెంబర్ నెలలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే ఈ ఉప ఎన్నికలో జేడీఎస్ పోటీ చేయదని ఇటీవలే ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే జేడీఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీతో రూ. 10 కోట్లు తీసుకొని జేడీఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఓటు బ్యాంకును చీల్చేందుకే కుమారస్వామి కుట్ర చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తమ వద్ద సరిపడ నగదు లేదని దేవేగౌడ ప్రకటించారు. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో ఉండట్లేదని తెలిపారు. కానీ ఇప్పుడు కుమారస్వామి మైనార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచారు. బీజేపీ ఏజెంట్‌గా కుమారస్వామి వ్యవహరిస్తున్నారని జమీర్ మండిపడ్డారు.
బసవకల్యాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ రావు సతీమణి మల్లమ్మ, బీజేపీ నుంచి శరణు సల్గార్, జేడీఎస్ నుంచి సయీద్ యాస్రాబ్ అలీ ఖాద్రీ పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Basavakalyan
- BJP
- Congress
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

