మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
ఉదయనిధి స్టాలిన్ | ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చురకలంటించారు. నిన్న ప్రధాని మోదీ తమిళనాడులోని అవినాసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ

చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చురకలంటించారు. నిన్న ప్రధాని మోదీ తమిళనాడులోని అవినాసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ.. ఉదయనిధి కోసం డీఎంకే సీనియర్లను ఆయన తండ్రి స్టాలిన్ పక్కన పెట్టారని ఆరోపించారు. తండ్రి మద్దతుతో ఉదయనిధి ఎన్నికల బరిలో నిలిచారని ప్రధాని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి అయ్యేందుకు బీజేపీలోని ఎంతో మంది సీనియర్లను మోదీ పక్కనపెట్టారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. ప్రధాని పోస్టు కోసం జాతీయ స్థాయి నాయకులను పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ఎల్కే అద్వానీ ఎక్కడ? అని అడిగారు. ప్రధాని అయ్యే అర్హత ఉన్న అద్వానీని మోదీ దూరం పెట్టాడని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదన్నారు. మోదీ వేధింపులు భరించలేక యశ్వంత్ సిన్హా పార్టీని వీడారు. తన పదవికి ఎలాంటి ప్రమాదం కలగొద్దనే ఉద్దేశంతో వెంకయ్య నాయుడిని కూడా మోదీ పక్కనపెట్టారని ఉదయనిధి పేర్కొన్నారు. తాను కరుణానిధి మనువడిని అన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి. సీఎం పళనిస్వామిలా.. మోదీ మోకరిల్లను అని ఉదయనిధి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

