కరోనా విజృంభణ.. రేపు వైద్యశాఖ అత్యవసర సమావేశం
కరోనా విజృంభణ | తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.

హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇవాళ ఉదయం వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్దతి కచ్చితంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు వైద్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసరం సమావేశం నిర్వహించనున్నారు.
కొత్తగా 684 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 394 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.కొత్తగా 684 పాజిటివ్ కేసులు
కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా 184 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి..
మాజీ ముఖ్యమంత్రికి బీజేపీ రూ. 10 కోట్లు!
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

