హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో(Minister Ponguleti) కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయంలో మంత్రి, అధికారులు బృందంతో వరద నష్టంపై చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు(Heavy rains) తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఇండ్లు , పంటలు నష్టపోయి ఆర్థికంగా నష్టపోయారు. అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read..