Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అక్కడ రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
మంత్రి వెంట.. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్,శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మార్గం మధ్యలో రబీ సీజన్ లో సస్యశ్యామలంగా మారిన పంటపొలాలను ఏరియల్ సర్వే ద్వారా మంత్రి పరిశీలించారు.
సింగరేణి కార్మికుల కోసం జిల్లాకేంద్రంలో సింగరేణి సంస్థ రూ.229 కోట్ల వ్యయంతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం (రామప్ప కాలనీ), జిల్లాకేంద్రంలోని వేశాలపల్లిలో పేదల కోసం రూ.33.08 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహం, గణపురం మండల కేంద్రంలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన తహసిల్దార్ కార్యాలయ నూతన భవనం, గణపురం మండలం గాంధీనగర్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల భవనం, రూ.14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం, దివ్యాంగుల సౌకర్యార్థం రూ.23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
అలాగే రూ.1.50 కోట్లతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో రూ.4.50 కోట్లతో చేపట్టే సింగరేణి మినీ స్టేడియం పనులు, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సాయం త్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సభికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అటు అధికారులు, ఇటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు.
Also Read..
నేడు భూపాలపల్లికి మంత్రి కేటీఆర్
Minister Ktr | తెలంగాణకు మరో రూ.800 కోట్ల పెట్టుబడి.. 1500 మంది యువతకు ఉద్యోగావకాశాలు
GPS | గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ చిప్‌లు.. ఎక్కడెక్కడ తిరిగారో అధికారులకు తెలియాల్సిందే
Genome Valley | ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ.. ఇవీ దీని ప్రత్యేకతలు
Stray Dogs | ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు.. కీలక నిర్ణయం