శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 16:04:51

దంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

దంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ఖమ్మం : ప్రజల చిరకాల వాంఛ అయిన దంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. రూ.74కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు వివరించారు. ఖమ్మం-బోనకల్ కు అనుసంధాన పనులను తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ప్యాచి పనులు రంగులు, మొక్కలు తదితర పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఈ దసరా నాటికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏండ్ల నాటి కల సాకారం కానుందని మంత్రి పేర్కొన్నారు.logo