హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా షుగర్ వ్యాధి పెరుగుతోంది. వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మేజర్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarasimha) తెలిపారు. గురువారం మెదక్లో నూతన మెడికల్ కళాశాలలో(Medical college) క్లాసులను ప్రారంభించారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాన్యుడు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడకూడదు.
ఇబ్బదులుంటే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరించబడ్డాయి. రోడ్డు ప్రమాదాల దృష్ట్యా వైద్యం తొందరగా అందించాలనే సంకల్పంతో తెలంగాణలోని హైవేలపై 74 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయన వెంట మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందర్రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మహారాష్ట్రకు వందల కోట్ల నగదు..! కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ : కేటీఆర్
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్