గుడిపల్లి, మార్చి 04 : నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం అంగడిపేట సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, రోళ్లకల్ గ్రామ పంచాయతీలో గత పది రోజులుగా వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ రాకపోవడంతో వరి పంటతో పాటు వేరుశనగ, మిరప, దొండ తోటలు వాడుపడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ కరెంట్ సమస్య పరిష్కారం కోసం రైతులందరూ కలిసి బుధవారం అంగడిపేట సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు ఉపక్రమించారు. సబ్ స్టేషన్ అధికారులు ఏడీ, ఏఈలకు సమస్యలు వివరించారు. దీనిపై వారు వారు స్పందిస్తూ రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యని రేపు మధ్యాహ్నం వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.