Akbaruddin Owaisi | హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఎంఐఎం ఊరుకోదు అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. బీఆర్ఎస్ పెట్టిన బకాయిలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిందే అని ఓవైసీ డిమాండ్ చేశారు. శాసనసభలో జీరో అవర్ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిధుల విడుదల చేయకపోవడంతో 7 లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏడాది నష్టపోతున్నారు. ఈ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసి కాలేజీలు నడుపుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆగిపోవడం కారణంగా.. 20 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా బాధపడుతున్నారు. 4 లక్షల మంది టీచింగ్ స్టాఫ్ సమయానికి జీతాలు పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం మరిచిపోవద్దు అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆగిపోవడంతో చాలా కాలేజీలు మూతపడుతున్నాయి. ఏడాది కాలం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా విడుదల చేయడం లేదు. ఇది బర్నింగ్ ఇష్యూ. దయచేసి అడుగుతున్నా.. సగంలో సగం అయినా నిధులు విడుదల చేయాలి. విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు. ఏదో నోట్ చేసుకుంటున్నాం.. అని మంత్రులు చెప్పొద్దు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోవద్దు. తప్పకుండా నిధులు విడుదల చేయండి. ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత. నిధులు విడుదల చేయకపోతే ఎంఐఎం పార్టీ ఆందోళనలు చేపడుతుంది. నిరసనలు వ్యక్తం చేస్తాం. అన్ని పార్టీలు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది అని ఎమ్మెల్యే ఓవైసీ కోరారు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రయత్నించగా, స్పీకర్ మైక్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత
Mana Ooru Mana Badi | ‘మన ఊరు – మన బడి’ పథకంపై మండలిలో చైర్మన్ గుత్తా ప్రస్తావన
Medical Students | తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట
Jamili Elections | లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు