Medical Students | హైదరాబాద్ : మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివినా, తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవోను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరణ చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత కల్పిస్తారు. ఈ జీవో అమలను ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది.
ఇవి కూడా చదవండి..
BRS | సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు.. ఫొటోలు
Harish Rao | ఉచిత విద్యుత్‌పై భట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Harish Rao | ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు