MLC Kavitha | మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | మూసీ అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
MLC Kavitha | హైదరాబాద్ : మూసీ అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) ద్వారా డీపీఆర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో ప్రస్తావించగా.. ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు.
మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ రూ. 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు మాకు నిర్ధిష్టమైన సమాచారం ఉంది. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా..? డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. మూసీ కోసం రూ. 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారు. ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు..? సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే… ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడుతాం అని కవిత హెచ్చరించారు.
మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవసస్తవమని స్పష్టమవుతోంది. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది… ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇవి కూడా చదవండి..
Mana Ooru Mana Badi | ‘మన ఊరు – మన బడి’ పథకంపై మండలిలో చైర్మన్ గుత్తా ప్రస్తావన
Medical Students | తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట
Jamili Elections | లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

