Mana Ooru Mana Badi | హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు – మన బడి పథకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు. మన ఊరు – మన బడి పథకం కింద మొదలుపెట్టిన పాఠశాలల బిల్లులు చెల్లించి, ఆ పాఠశాలలను పూర్తి చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు – మన బడి పథకం కింద చాలా గ్రామాల్లో పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు నా ఊర్లోనే మన ఊరు – మన బడి పథకం కింద జిల్లా పరిషత్ హైస్కూల్‌ను తీసుకున్నారు. స్లాబ్ వేశారు. గోడలు, కిటికీలు లేవు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం.. ఆ పథకాన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చింది. అసంపూర్తిగా మిగిలి ఉన్న భవనాలను పూర్తి చేస్తే బాగుండేది. కాబట్టి మీరు మన ఊరు – మన బడి పథకం కింద నిర్మించిన భవనాల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. అంతేకాకుండా మిగిలి ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. పిల్లలు చెట్ల కింద కూర్చొనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా చోట్ల భవనాలు సగం నిర్మాణాల వద్దే ఆగిపోయాయని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ కింద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వీటిని పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
Medical Students | తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట
BRS | సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు.. ఫొటోలు
Harish Rao | ఉచిత విద్యుత్‌పై భట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు