Medipally VivekReddy | తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు అత్యంత దురదృష్టకరంగా మారాయని బీఆర్ఎస్ నేత మేడిపల్లి వివేక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారిన స్థాయిలో మాట్లాడటం అత్యంత బాధాకరమని, రాజకీయ హుందాతనానికి పూర్తిగా విరుద్ధమని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అంటూ బెదిరింపులకు దిగడం రాజకీయ అహంకారానికి పరాకాష్టగా అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా కష్టపడి జీవిస్తున్న ఎన్ఆర్ఐలను అవమానించేలా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయమని వివేక్ పేర్కొన్నారు. ఉపాధి కోసం స్వదేశాన్ని వదిలి విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డల శ్రమను చిన్నచూపు చూడటం సమాజానికి తగదని అన్నారు.
శ్రమకు గౌరవం ఇవ్వడమే నిజమైన సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గౌరవాన్ని, స్వాభిమానాన్ని కాపాడేందుకు ఎప్పటికీ ముందుంటుందని, ప్రజలే తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని మేడిపల్లి వివేక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు