వరంగల్ : వరంగల్ జిల్లా ఎస్బీఐ బ్యాంకులో(SBI Bank) భారీ చోరీ(Massive robbery) జరిగింది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(SBI) సోమవారం రాత్రి భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.10 కోట్ల విలువచేసే బంగారాన్ని అపహరించినట్లు తెలిసింది. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దింపి విచారణలో వేగం పెంచారు.
Also Read..
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ వివాహం.. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది..?
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా