Keerthy Suresh | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ (Keerthy Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)తో ఏడడుగులు వేయబోతున్నారంటూ తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలనే చదివినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ హైస్కూల్ ప్రేమికులు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
డిసెంబర్ రెండో వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 11, 12 తెదీల్లో గోవా (Goa)లో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందంట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. వెడ్డింగ్‌కు సంబంధించి కీర్తి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ వరుస కథనాలు వస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత జి సురేశ్ కుమార్, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేశ్.. గీతాంజలి సినిమాతో మలయాళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అనంతరం ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు నటించిన ఇది ఎన్న మాయం అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఇయర్లో ‘నేను శైలజా’ అంటూ తెలుగులో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రజిని మురుగన్, భైరవ, మహానటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో ‘బేబి జాన్’ అనే సినిమాలో నటిస్తోంది.
Also Read..
Vijay Devarakonda | ప్రేమ తప్పక పుడుతుంది కాస్తా టైం ఇవ్వండి : విజయ్ దేవరకొండ
Spirit Movie | యానిమల్‌ను మించేలా ‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్
Nayanthara Vs Dhanush | మరింత రాజుకున్న నయన్-ధనుష్ వివాదం..