Sahiba Music Video | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ‘సాహిబా’ (Sahiba) అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘హీరియే..’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ రూపొందించిన సాహిబా అనే ఆల్బమ్‌లో విజయ్ దేవరకొండ నటించాడు. ఇందులో విజయ్‌కి జంటగా.. రాధిక మదన్ కనిపించింది. రీసెంట్గా ఈ ఆల్బమ్ విడుదల చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సంపాదించుకుంది. అయితే ‘సాహిబా’ ఆల్బమ్ ప్రమోషన్స్‌లో పాల్గోన్న విజయ్ దేవరకొండ లవ్ విషయంలో ప్రస్తుతం ఉన్న యూత్‌కి సలహా ఇచ్చాడు.
ఈ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. ప్రేమ అనేది తప్పక పుడుతుంది అబ్బాయిలు. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు. కాస్తా టైం ఇవ్వండి. అన్నిటికంటే ముందుగా పురుషులు ఎదగాలి. ఇదేం చెడ్డ విషయం కాదు. మీరు కొంచెం సమయం ఇవ్వాలి లవ్ విషయంలో.. 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారి కంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ అనుభవం. 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి అంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.
Love will happen,you guys are young, give it time
First of all men need to grow
#VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/r4zFPDYScg
— Suresh PRO (@SureshPRO_) November 19, 2024