చార్మినార్, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు.. మంగళవారం హైకోర్టు ప్రాంగణంలోని అనువణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 3 గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు, ఇతర అనుమానిత పరికరాలను గుర్తించలేదని వెల్లడించారు.