Prabhas | అగ్ర కథానాయకుడు ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లను సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నట్లు దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్లో పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమాని ప్రారంభించి… జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. ఆరునెలల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.