టెల్ అవివ్ : బాలిస్టిక్ క్షిపణులు, క్లస్టర్ బాంబుల(Cluster Munitions)తో ఇజ్రాయెల్‌పై ఇరాన్ తాజాగా అటాక్ చేసింది. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, మరో అగ్ర కమాండర్ ఘోలమ్రెజా సోలేమాని.. సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడులకు ప్రతీకారంగా మంగళవారం రాత్రి ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. అయితే బాలిస్టిక్ క్షిపణులకు చెందిన క్లస్టర్ బాంబులతో సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతంలో నష్టం జరిగినట్లు తెలిసింది. క్లస్టర్ బాంబుల్లోని ఓ సబ్మ్యునిషన్ రోడ్డును డ్యామేజ్ చేసింది.
అనేక ప్రాంతాల్లో క్లస్టర్ బాంబు బాధితులు చేస్తున్న ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ అవుతున్నట్లు అధికారులు చెప్పారు. క్లస్టర్ బాంబుల వల్ల ఎటువంటి గాయాలు కాలేదని మెడిక్స్ చెబుతున్నారు. బాలిస్టిక్ క్షిపణులు ఫైర్ చేసినట్లు సమాచారం రాగానే, ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగిస్తున్నారు. దీని వల్ల ప్రజలు సరైన సమయంలో అప్రమత్తం అవుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా సైరన్లు వినిపించాయి. క్లస్టర్ బాంబులకు చెందిన వీడియోను షేర్ చేశారు.
The latest Iranian ballistic missile targeting central Israel appears to have carried a cluster bomb warhead, footage shows. pic.twitter.com/8j2JcLem9a
— Emanuel (Mannie) Fabian (@manniefabian) March 18, 2026