Hanumakonda | హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్ (54), రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి 2023లో ప్రవీణ్ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా ప్రవీణ్.. వారిద్దరి ఒంటిపై డీజిల్ పోసి నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇక ప్రవీణ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.