ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 13:51:15

రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ : ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం గడిచిన ఆరేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో అద్భుత ప్రగతితో ముందుకు సాగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌  జిల్లా కడెం మండలం బెల్లాల్‌ గ్రామంలో రైతు వేదికలు , 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించి విజయవంతంగా అమలు చేస్తున్నాం. నూతన వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు.నియంత్రిత సాగు విధానంతో రైతులు లబ్ధి పొందుతారు. రైతులు ఐక్యంగా ఉండేందుకు రైతు వేదికలు ఎంతో దోహదం’’అవుతాయని తెలిపారు.  కరోనా కష్టకాలంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ మొదటి హరితహారంలో భాగంగా 2015 జూలై 5న  దేవునిగూడెంలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటిన లక్ష మొక్కల ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.  


logo