నంగునూరు, ఏప్రిల్ 24: ‘ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా.. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం బీఆర్ఎస్కు సెంటిమెంట్ ఆలయం అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో స్వామి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు మెదక్ పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు. మాట తప్పే మనిషిని కాదని, స్వామివారి సాక్షిగా ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ యువకులకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, మారెడ్డి రవీందర్‌రెడ్డి, సంగు పురేందర్, రాగుల సారయ్య, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.