వనపర్తి : వనపర్తి(Wanaparthi) జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో 25 మంది కూలీలకు గాయాలయ్యాయి(Laborers injured). నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన కొత్తకోట మండలం కందిమెట్ట వద్ద మంగళవారం చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూత్కూరు గ్రామానికి చెందిన కూలీలు మహబూబ్‌నగర్ జిల్లా వెంకంపల్లిలో పత్తి ఏరేందుకు బొలెరో వాహనంలో బయలు దేరారు.
అయితే కందిమెట్ట వద్ద 44వ జాతీయ రహదారిపై రాగానే ఒక్కసారిగా వాహనం టైరు పగిలి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా నలుత్రు తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.