సిద్దిపేట : బైక్ పై నుంచి పడి(Bike accident) వ్యక్తి మృతి(Man died) చెందిన సంఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా అక్బర్-భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ వి.హరీశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నర్సింలు (58) వివిధ పనుల నిమిత్తం భూంపల్లి వచ్చి పనులను పూర్తి చేసుకొని గాజులపల్లికి గ్రామానికి తిరిగి వెళ్తున్నాడు.
ఇదే క్రమంలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతునికి భార్యతో పాటు కూతురు బాలలక్ష్మి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బక ఏరియా దవాఖానకు తరలించారు. నర్సింలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు : కేటీఆర్
Rakesh Reddy | జీవో 29 సారాంశమే సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు.. రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం