KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎందుకంటే సియోల్‌లో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిపుణులు, పర్యావరణవేత్తలు, హైడ్రాలజిస్టులు, ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లను పంపుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బృందం మొత్తం అద్భుతమైన ఫలితాలతో తిరిగి వస్తుంది. ఇక ప్రజాధనం రూ. 1.5 లక్షల కోట్లను ఖర్చు చేయొచ్చని కచ్చితంగా సమర్థిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక సౌత్ కొరియాలోని సియోల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం బృందం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటించనుంది. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, అధికారులతో పాటు ఆయా మీడియా సంస్థల ప్రతినిధులు సియోల్ టూర్‌కు వెళ్లే వారిలో ఉన్నారు.
My compliments to the Telangana Govt on sending a team of Experts, Environmentalists, Hydrologists, Engineers & Bureaucrats to study the River Front Development in Seoul
Am sure they will come back with excellent results and justify spending ₹ 1.5 Lakh Crores (approximately USD… https://t.co/gCi8uiNT0O
— KTR (@KTRBRS) October 20, 2024
ఇవి కూడా చదవండి..
Meinhardt | సియోల్ ఎందుకు దండగ.. మెయిన్‌హార్ట్ ప్రాజెక్టులు ఉండగ
Musi Riverfront | గోల్మాల్ మూసియోల్.. మూసీ పేరిట సర్కార్ విదేశీ యాత్ర
KTR | మూసీ వద్ద మూడేండ్లు ఉంటా.. సీఎం చెప్పినట్టుగా సుందరీకరణ ఆపేస్తారా?: కేటీఆర్