KCR Birthday Celebrations | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. తెలంగాణభవన్ ద్వారాలను పూలదండలు, తోరణాలతో అలంకరించారు. ప్రాంగణంలో కేసీఆర్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితర నేతలు హాజరై 72 కేజీల కేక్ కట్ చేస్తారు. ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్న డాక్యుమెంటరీని తిలకించనున్నారు.