హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతలు అడుగడుగునా కౌన్సిలర్ల కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డొచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతూ అప్రజాస్వామికంగా, అక్రమ పద్ధతుల్లో ఓట్లు నమో దు చేసుకుంటూ పదవులు కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరీని సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవించాల్సిన ప్రభుత్వం, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని గూండాల మాదిరిగా వ్యవహరించడం శోచనీయమని వాపోయారు. స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలే గెలిచిన ప్రజాప్రతినిధులను కి డ్నాప్ చేసే ప్రయత్నాలకు పాల్పడటం, ఎకడికకడ దాడులకు తెగబడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొర్రూరు, జనగామ, క్యాతనపల్లి, కాగజ్‌నగర్ వంటి అనేక పట్టణాల్లో పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని పలు పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ గూండా రాజ్యానికి అద్దం పడుతున్నదని విమర్శించారు. స్వయంగా అధికారులు, పోలీసులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఎ న్నికల కోడ్‌ను తుంగలో తొకారని మండిపడ్డారు.
ఎక్స్అఫీషియో పేరుతో దొంగ ఓట్లు..
మంత్రులు, ఎమ్మెల్యేలే నేరుగా అక్రమ పద్ధతు ల్లో చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో తలదూర్చడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకొని మరీ పదవులను పొందాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేరొన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ల ఎంపికలో జరిగిన దౌర్జన్యాలను ఎత్తిచూపారు. అనేక చోట్ల కాంగ్రెస్ నాయకులు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులు, పార్టీ మార్పులు, దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు పట్టణాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేయడంపై మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు తొత్తులుగా పోలీసులు, అధికారులు
గెలిచిన ప్రజాప్రతినిధులను పట్టపగలు పోలీసుల సమక్షంలోనే అడ్డుకుంటున్నా స్పందించని తీరు చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు సోమవారం జరిగిన పరిణామాలే సాక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిన కొందరు పోలీస్ అధికారులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కోరం ఉన్న చోట్ల కూడా కేవలం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలను వాయిదా వేయడం ఎన్నికల సంఘం పనితీరుకు మాయని మచ్చగా నిలుస్తుందని ఆక్షేపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. అక్రమ కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన క్రిమినల్ మెంటాలిటీతో, గూండాల బలంతో ప్రజల ఆకాంక్షలు, బీఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న ఈ అరాచకానికి, గూండాయిజానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
జమ్మికుంటను ఆదర్శంగా తీర్చిదిద్దండి ; మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు
జమ్మికుంటను రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ అలియాజ్ దిలీప్, వైస్‌చైర్మన్ ముంతాజ్ అలీకి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించా రు. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం ప్రజలకు తమపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. సో మవారం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం అనంతరం వారు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై జమ్మికుంట ప్రజలు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంట పట్టణంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసేలా పాలన అందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వ మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధిదీపాల ఏర్పా టు, పట్టణ సుందరీకరణ వంటి అభివృద్ధి పనుల కు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.