ఐటీలో తెలంగాణ మేటి
ఐటీ అభివృద్ధిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎగుమతుల్లో 299శాతం పెరుగుదల నమోదై, దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ ఒకటి సృష్టించింది.
- ఐటీ ఎగుమతుల్లో 299% వృద్ధి
- కేంద్రం తాజాగణాంకాలే సాక్ష్యం
- ఎక్స్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ‘ఐటీ అభివృద్ధిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎగుమతుల్లో 299శాతం పెరుగుదల నమోదై, దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ ఒకటి సృష్టించింది. 2023-24 సంవత్సరానికి కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఐటీ ఎగుమతులపై కేంద్రం విడుదల చేసిన లెక్కలే కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ సాధించిన పురోగతిపై సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కేసీఆర్ విజన్-కేటీఆర్ మిషన్ ఐటీకి ఐకాన్’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. 2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో రూ.57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు, బీఆర్ఎస్ సర్కార్ విప్లవాత్మకమైన నిర్ణయాలు, వినూత్న పాలసీలు, కార్యక్రమాలతో 2023-24 నాటికి రూ.2,72,076 కోట్లకు చేరాయని వివరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీ రంగం ప్రగతిపథంలో పురోగమించిందని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

