రాంచి: గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. రాంచీలోని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలోని బెడ్ వద్దకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. (Jharkhand Students Protest) ఈ నేపథ్యంలో జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్కేఎం) నాయకుడైన దేవేంద్ర నాథ్ మహతో ఆసుపత్రి వార్డు డోర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తనను అడ్డుకోవడానికి పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తనను బయటకు వెళ్లడానికి అనుమతించే వరకు ఆసుపత్రి బెడ్ రూమ్ డోర్ వద్ద కూర్చుంటానని ఆయన తెలిపారు. చికిత్స కూడా చేయించుకోనని స్పష్టం చేశారు. ‘ప్రజల హక్కులు, న్యాయం కోసమే నా పోరాటం. నన్ను అడ్డుకోవడం ద్వారా వారు నా గొంతును నొక్కలేరు’ అని ఆయన అన్నారు.
కాగా, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జైఎస్ఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షలలో అక్రమాలు జరిగినట్లు ఆ రాష్ట్ర విద్యార్థులు ఆరోపించారు. 20 రోజులకుపైగా నిరసన చేస్తున్నారు. ఆగస్ట్ 2న దేవేంద్ర నాథ్ మహతో ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.
అయితే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఆ తర్వాత నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతో ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అయితే తిరంగా యాత్రలో పాల్గొనేందుకు బయటకు వెళ్తున్న దేవేంద్ర నాథ్ మహతోను పోలీసులు అడ్డుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
14 दिनों से भूख हड़ताल पर बैठे मेरे साथ आज पुलिस द्वारा धक्का-मुक्की और बलपूर्वक रोकने की कोशिश की गई। मेरे साथ मौजूद साथियों के साथ भी पुलिस द्वारा मारपीट की गई।
कई दिनों से भूखा होने के बावजूद मैं अपने अधिकार और जनता की आवाज़ के लिए खड़ा हूँ। हमें इस तरह रोककर हमारी आवाज़ को… pic.twitter.com/TRxMaMkBqR
— Devendra Nath Mahto (@DevendraNathMa9) August 15, 2026
पुलिस द्वारा लगातार धक्का-मुक्की कर मुझे रोका गया। आखिरकार मैं अपने रूम के गेट के बाहर ही बैठ गया हूँ।
जब तक मुझे यहाँ से बाहर निकलने नहीं दिया जाता, तब तक मैं यहीं बैठा रहूँगा। मैं अपना इलाज भी नहीं करवाऊँगा और यहीं रहकर अपनी बात रखूँगा।
मेरी लड़ाई जनता के अधिकार और न्याय के… pic.twitter.com/YOSqJE0Ylc
— Devendra Nath Mahto (@DevendraNathMa9) August 15, 2026