Plastic Ban | ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం.. గ్రామపంచాయతీ తీర్మానం
Plastic Ban | ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఎత్తొండ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు ఓ హోటల్‌కు స్టీల్ గ్లాసులను సర్పంచ్ శ్వేత సూర్యకాంత్ అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునేందకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Plastic Ban | కోటగిరి: పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ‘ప్లాస్టిక్ వాడకం వద్దు స్టీల్ వాడకమే ముద్దు’ అనే నినాదంతో ప్లాస్టిక్‌ను నివారించేందకు నడం బిగించింది నిజామాబాదు (Nizamabad) జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక సర్పంచ్ శ్వేత సూర్యకాంత్ అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రామంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ శ్వేత తెలిపారు.
ఎత్తొండ గ్రామంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడకంపై పూర్తిగా నిషేధిస్తామని సర్పంచ్ (Sarpanch) అన్నారు. గ్రామంలోని నాలుగు హోటళ్లకు 200 స్టీల్ టీ గ్లాసులను సర్పంచ్ తరఫున పంపిణీ చేశారు. ఇకమీదట గ్రామంలో హోటళ్లలో ప్లాస్టిక్ టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ టీ గ్లాసులు వాడవద్దని యజమానులకు సూచించారు. స్టీల్ గ్లాసులు మాత్రమే వాడాలని నిబంధన పెట్టామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు షేక్ మస్తాన్, రమేష్, దండులాలు, భూమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

