Sree Vishnu | వైవిధ్యమైన కథలు, ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్డేట్ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విప్లవం సృష్టించడానికి కాకుండా, థియేటర్లలో పూర్తి స్థాయి నవ్వుల విప్లవాన్ని పంచడానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ వస్తున్నాడని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
1990ల కాలం నాటి వింటేజ్ ఫ్లేవర్‌లో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల నేపథ్యంతో ఈ పీరియడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా, సత్య, ముక్కు అవినాష్‌తో పాటు పలువురు ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తుండగా, కోన వెంకట్ సమర్పిస్తున్నారు. వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, భాస్కరభట్ల సాహిత్యం సమకూరుస్తున్నారు. విభిన్నమైన మాస్ లుక్‌లో శ్రీవిష్ణు కనిపిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను త్వరలోనే మరింత వేగవంతం చేయనున్నారు.
This Independence Day, Announcing the release date of the Ultimate Fun Entertainer 😆🇮🇳#COMRADEKALYAN IN WORLDWIDE THEATERS FROM OCTOBER 9TH ❤️🔥❤️🔥❤️🔥
Comrade is coming… not to start a revolution, but to start a LAUGH RIOT! 😂✊#HappyIndependenceDay #LOLSalaam@sreevishnuoffl… pic.twitter.com/6SMZmvIorX
— Skanda Vahava Motion Pictures (@svmpictures) August 15, 2026