కాంగ్రెస్ రౌడీయిజం నడువదు
అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు.
- ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు సుస్థిర స్థానం
- బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రావణకాష్టంలా మారిందని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కిశోర్‌గౌడ్, లక్ష్మణ్, రవినాయక్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజు కేసీఆర్ పుట్టిన రోజు అని అభివర్ణించా రు. గాంధేయమార్గంలో తెలంగాణ సాధించిన మహానేత కేసీఆర్ అని కీర్తించారు. పోరాడి సాధించిన తెలంగాణను పదేండ్లలో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని ఉద్ఘాటించా రు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటాం..
గాంధేయమార్గంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ తమకు అదే విధానం నేర్పారని సాయికిరణ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ తమ నాయకులపై పెట్టే అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ఉద్యమాలు తమకు కొత్తకాదని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు కేటీఆర్, హరీశ్‌రావు హాజరవుతారని వెల్లడించారు. గులాబీ సైనికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

