పెరోల్ ముగిసినా 20 మంది బయటే!
రాష్ట్రంలో జైళ్లశాఖపై నిఘా కరువైంది. చాలామంది అధికారులు ఉన్నతాధికారుల కండ్లుగప్పి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దాదాపు 20 మంది ఖైదీలు పెరోల్ గడువు ముగిసినప్పటికీ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.
- ‘రాంగ్ రిలీజ్’లపై జైళ్లశాఖలో తీవ్ర చర్చ
- అధికారుల నిర్లక్ష్యంపై డీజీ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జైళ్లశాఖపై నిఘా కరువైంది. చాలామంది అధికారులు ఉన్నతాధికారుల కండ్లుగప్పి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దాదాపు 20 మంది ఖైదీలు పెరోల్ గడువు ముగిసినప్పటికీ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయినా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని జైళ్లశాఖ డీజీ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవడంతోపాటు సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అధికారుల అలసత్వం, జైళ్లలోని భద్రతా లోపాలపై డీజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పెరోల్ ముగిసిన ఖైదీలను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని, వారిని జైళ్లకు తరలించకుండా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని నిలదీసినట్టు సమాచారం.
‘రాంగ్ రిలీజ్’లు జైళ్లకు మచ్చతెచ్చేలా ఉన్నాయని తీవ్రంగా స్పందించినట్టు వినికిడి. 2024 డిసెంబర్లో తప్పుడు పత్రాలు సమర్పించి జైలు నుంచి విడుదలైన ఫయాజ్ గురించి ఈ భేటీలో తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. పరకాల, చర్లప్లలిలో ఖైదీలు పరారవడం జైళ్లలో భద్రతను ప్రశ్నిస్తున్నాయని డీజీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి బాధ్యులైన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినప్పటికీ మిగతా సిబ్బందిలో మార్పు రావడం లేదని, ఇకనుంచి ఎలాంటి పొరపాట్లు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. జైళ్లలో భద్రతా ఏర్పాట్లపై వచ్చే నెలలో మరోసారి సమీక్ష నిర్వహిస్తానని, ఆ లోగా తప్పిదాలన్నీ సరిదిద్దుకోవడంతోపాటు పెరోల్ ముగిసిన వారందరినీ తిరిగి జైళ్లకు తరలించాలని ఆదేశించినట్టు వినికిడి. ఇక నుంచి జైళ్లలో ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినా అప్పటికప్పుడే కఠిన చర్యలు చేపడుతానని డీజీ హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

