Rakesh Reddy | హైదరాబాద్ : గ్రూప్-1 నియామకాల విషయంలో అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులు మాట్లడుతున్నవా..? లేక, మతి తప్పి మాట్లాడుతున్నవా సీఎం రేవంత్ రెడ్డి అని నిలదీశారు.
బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా ఒళ్ళు మరచి మాట్లాడి తెలంగాణ పరువు తీస్తున్నావ్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎంకు వాళ్ల ప్రభుత్వం తెచ్చిన జివో సారాంశమే సరిగ్గా తెలియదని చెప్పితే ఇజ్జత్ పోయేలా ఉంది. చెప్పకుంటే ప్రాణాలే పోయేలా ఉంది. పట్టపగలే పచ్చి అబద్ధాలు ఆడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 నిబంధనలను ఉటంకిస్తూ మీరు తెచ్చిన జీవో 29 అదే అనటం మీ అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేస్తుందని రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
జీవో 29కు జీవో 55కి గల తేడాను సుస్పష్టంగా మీకు, మీ ప్రభుత్వానికి కేటీఆర్ అర్థం అయ్యేలా వివరించారు. అది చూసైనా నేర్చుకోండి. లేదంటే, సహాయకులుగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళనైనా పెట్టుకోండి. లేదంటే హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా మీరు తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతిభగల విద్యార్ధులకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. అవసరమైతే దానిపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. కాబట్టి వారినైనా సంప్రదించి మాట్లాడండి. ఒక సబ్జెక్టు లేని ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకురాకు జర అని రేవంత్ రెడ్డికి రాకేశ్ రెడ్డి సూచించారు.
తలకిందులు మాట్లడుతున్నవా? లేక, మతి తప్పి మాట్లాడుతున్నవా సీఎం రేవంత్ రెడ్డి @revanth_anumula గారు.
బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా ఒళ్ళు మరచి మాట్లాడి తెలంగాణ పరువు తీస్తున్నావ్.
తెలంగాణ సిఎం కు వాళ్ల ప్రభుత్వం తెచ్చిన జివో సారాంశమే… pic.twitter.com/EXtB33rjjY
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) October 20, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 Aspirant | సీఎం రేవంత్ సారూ.. ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి.. గ్రూప్-1 అభ్యర్థి విన్నపం..
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ