Group-1 Aspirants | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. గ్రూప్-1 అభ్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పినట్టు చెప్పే.. మళ్లీ వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. ఇందుకు సాక్ష్యం ఇవాళ ఉదయం అశోక్ నగర్లో చోటు చేసుకున్న పరిణామాలే.
గ్రూప్-1 అభ్యర్థులందరూ కలిసి అశోక్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై నిరుద్యోగులకు వివరించేందుకు గ్రూప్-1 అభ్యర్థులు ప్రయత్నించారు. గ్రూప్-1 నిర్వహించి తీరుతామని మొండిగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అభ్యర్థులు సిద్ధం కాగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఇక గాంధీ భవన్ ముట్టడికి బయల్దేరిన ఓయూ జేఏసీ నేత మోతిలాల్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు. జీవో 29ను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Aspirant | సీఎం రేవంత్ సారూ.. ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి.. గ్రూప్-1 అభ్యర్థి విన్నపం..
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ