Group-1 Aspirant | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థి ఒకరు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మమల్ని కలవడం లేదు.. మేము ఎందుకు మా సీఎంతో మాట్లాడడానికి ఇంత కష్ట పడాలి. మీరు ఎందుకు మాతో మాట్లాడటం లేదు.. మాకు ఒక 10 నిమిషాలు టైమ్ ఇవ్వండి.. తర్వాత మీరు ఏది అంటే అదే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని గ్రూప్స్ అభ్యర్థి వేడుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత