Group-1 Aspirants | హైదరాబాద్ : జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల హక్కులను కాలరాసే జీవో అని.. దీనిపై మన పోరాటం ఆపొద్దని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ పిలుపునిచ్చారు. గాంధీ భవన్ ముట్టడి సందర్భంగా మోతీలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ గ్రూప్-1 అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదనతో మాట్లాడారు.
జీవో 29పై పోరాటం చేస్తున్న నాపై పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేశారు. తెలంగాణలోని నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాలి. ఇది మన హక్కులకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ఇచ్చిన మన హక్కులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది. జీవో 29.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులను కాలరాసే జీవో ఇది. ఈ జీవో కారణంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులంతా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలపండి. ఇది ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాసే జీవో. ఎట్టి పరిస్థితుల్లో మన పోరాటం ఆపొద్దు.. ఖబడ్డార్ తెలంగాణ ప్రభుత్వమా.. అని మోతీలాల్ హెచ్చరించారు. ఇక తనను బండ్లగూడ పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారని, శాంతియుత నిరసన తెలిపేందుకు నిరుద్యోగులు అక్కడికి రావాలని మోతీలాల్ కోరారు.
నిరుద్యోగ నాయకుడు మోతిలాల్ నాయక్ అరెస్ట్
గాంధీభవన్ కంచె దూకడానికి ప్రయత్నించిన నిరుద్యోగ నాయకుడు మోతిలాల్ నాయక్
గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో గాంధీ భవన్ ముందు భారీగా పోలీసుల మోహరింపు..
మోతిలాల్ నాయక్‌ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు. pic.twitter.com/ZavQlrfib7
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2024
ఇవి కూడా చదవండి..
Rakesh Reddy | జీవో 29 సారాంశమే సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు.. రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
Group-1 Aspirant | సీఎం రేవంత్ సారూ.. ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి.. గ్రూప్-1 అభ్యర్థి విన్నపం..