బెంగళూరు: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూకి పక్క లేన్లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు. (car jumps divider, hits bus) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్ పైనుంచి జంప్ చేసింది. మరో లేన్లోకి దూసుకెళ్లింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును ఆ కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులోని 43 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని మరో బస్సులోకి ఎక్కించి పంపారు. ఈ ప్రమాదంలో మరణించిన స్నేహితులైన యువకుల వయస్సు 17 నుంచి 22 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరోవైపు కారు నడిపిన వ్యక్తి, ఇతరులు మద్యం సేవించారా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మృతుల రక్త నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు చెప్పారు. కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే చేతికి అందివచ్చిన కుమారుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలుసుకుని అతడి తల్లి తల్లడిల్లిపోయింది.
Also Read:
Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
Watch: లోడ్ ట్రాక్టర్ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?