హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను విదేశాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో లండన్ టవర్ బ్రిడ్జి వద్ద భారీ కేక్ కట్ చేశారు. కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కువైట్‌లో ఎన్నారై బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గోడిశాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం చేశారు. ఆయా కార్యక్రమల్లో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరిగౌడ్ నవాబుపేట్, రవి రేటినేని, సత్యమూర్తి చిలుముల, నాయకులు అశోక్‌గౌడ్ దూసరి, రవిప్రదీప్ పులుసు, తరుణ్ లునావత్, అబ్దుల్ ఖు ద్దూస్, ఇమ్రాన్, హరీశ్‌రెడ్డి, జనార్దన్, అస్లాం, సా యికిరణ్, యశ్వంత్, సురేశ్‌గౌడ్, ప్రమోద్, అయ్య ప్ప, జగదీశ్, వసంత్, నరేందర్, జమీల్, రవి, నౌషి, రామ్‌చరణ్, హిమాన్షు, పవన్ పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు పథకాలతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించారని, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి కొత్తఊపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నిండూ నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మళ్లీ సీఎంగా సేవలు అందించాలని కోరుకున్నారు.
సంక్షేమ పాలనకు ప్రతీక కేసీఆర్ : నామా
తెలంగాణ కలను సాకారం చేసి, రాష్ర్టాన్ని సంక్షే మ పాలనకు ప్రతీకగా నిలిపిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌కే దక్కిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు కొనియాడారు. రాష్ర్టాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు జీవించాలని నాగేశ్వర్రావు ఆకాంక్షించారు.