చేర్యాల/సిద్దిపేట : భక్తుల శివనామస్మరణతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు.
కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు