లాక్ డౌన్‌ను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

వరంగల్ అర్బన్ : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్ డౌన్ విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
ఉదయం 6.00 గంటల నుంచి10.00 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్ డౌన్ సడలింపు ఉండగా, ఉదయం 8.00 గంటల పిదప ఒక్కసారిగా నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకై బయటకు వస్తున్నారని, దీంతో జనసమూహం పెరుగుతున్నదని ఆయన అన్నారు.
ఇంటినుండి ఒక్కరే వెళ్లాలని, వారం రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకోవాలని ఆయన కోరారు. లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లేనట్లయితే మార్కెట్లలో బజారులలో రద్దీ పెరిగి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని మంత్రి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పక మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలి, తరచూ శానిటైజర్ తో చేతులను శుభ్ర పరుచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
మండపంలో పెండ్లి కూతురు.. పోలీసు వాహనంలో తల్లిదండ్రులు
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

